- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు శివారులో చిక్కిన చిరుత
<p>దిశ, వెబ్‌డెస్క్: గత ఐదునెలలుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. వలంతరిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీనిని అధికారులు ఆదివారం ఉదయం గమనించారు. ఆవులను తినేందుకు వచ్చి బోనులో చిక్కినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేగాకుండా శనివారం రెండు ఆవులపై దాడి చేయడంతో అవి మృత్యువాత పడ్డాయి. దీంతో చిరుత సంచారం గమనించిన అధికారులు ఆవుల చుట్టూ బోనులు ఏర్పాటు చేసి, పట్టుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గత ఐదునెలలుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. వలంతరిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీనిని అధికారులు ఆదివారం ఉదయం గమనించారు. ఆవులను తినేందుకు వచ్చి బోనులో చిక్కినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేగాకుండా శనివారం రెండు ఆవులపై దాడి చేయడంతో అవి మృత్యువాత పడ్డాయి. దీంతో చిరుత సంచారం గమనించిన అధికారులు ఆవుల చుట్టూ బోనులు ఏర్పాటు చేసి, పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ చిరుతను జూపార్క్‌కు తరలించారు. దాదాపు ఐదు నెలలుగా ఆ చిరుత కోసం 10 బోన్లు, 30 ట్రాప్ కెమెరాలలో అధికారులు చిరుత కోసం గాలించారు.
Next Story






