- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి చెందింది. గుడిహత్నూర్ మండలం మేకల గండి సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీ కొట్టింది. జాతీయ రహదారికి ఇరువైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో రోడ్డు దాటే ప్రయత్నంలో చిరుత వాహనం కింద పడి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ కన్జర్వేటర్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ సి.పి […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి చెందింది. గుడిహత్నూర్ మండలం మేకల గండి సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీ కొట్టింది. జాతీయ రహదారికి ఇరువైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో రోడ్డు దాటే ప్రయత్నంలో చిరుత వాహనం కింద పడి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ కన్జర్వేటర్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ సి.పి వినోద్ కుమార్ ఆదిలాబాద్ డీఎఫ్ఓ డాక్టర్ ప్రభాకర్ తదితరులు వెళ్లి పంచనామా నిర్వహించారు. అనంతరం చిరుత కళేబరాన్ని ఆదిలాబాద్ సమీపంలో ఉన్న మావల ఫారెస్ట్ పార్క్‌కు తరలించారు.
Next Story






