- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. వాహనం ఢీకొని చిరుత మృతి
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యం కొండ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మరణించింది. గత కొన్ని నెలలుగా మన్యం కొండ గుట్టలతోపాటు పరిసర ప్రాంతాలలోని గుట్టలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున మన్యం కొండ దేవాలయం గుట్టల్లో నుంచి రోడ్డు దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మరణించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చిన […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యం కొండ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మరణించింది. గత కొన్ని నెలలుగా మన్యం కొండ గుట్టలతోపాటు పరిసర ప్రాంతాలలోని గుట్టలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
బుధవారం తెల్లవారుజామున మన్యం కొండ దేవాలయం గుట్టల్లో నుంచి రోడ్డు దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మరణించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చిన వెంటనే అటవీ శాఖ అధికారి గంగిరెడ్డి, తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
కాగా మూడు నెలల క్రితమే కోయిల కొండ మండలంలో గేదెల దాడిలో ఓ చిరుత మరణించిన ఘటన మరువకముందే ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరో చిరుత మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.

Next Story






