బీజేపీ వాహనాలు ధ్వంసం.. దాడి చేసింది ఎవరు..?

72

దిశ, వెబ్‌‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ హీట్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ జనాల్లోకి వెళ్లేందుకు భారీ ప్రచార రథాలను రెడీ చేసింది. వర్చువల్ సమావేశాల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. కానీ, అనూహ్యంగా ఈ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. అయితే, టీఎంసీ నేతలే ఈ చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రచారం మొదలుతోనే మరీ ఈ స్థాయిలో అగ్గిరాజుకుంటే.. ఎన్నికల సమీపంలో మరెన్ని ఘటనలు చోటుచేసుకుంటాయేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..