- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రముఖ నటుడు సోసాని కృష్ణమురళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర పాలకులు తెలంగాణను వదిలి వెళ్లాక కొత్త రాష్ట్రంగా తెలంగాణ దగదగలాండింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. నగరంలో ఒక్కరోజు కూడా పవర్ కట్ లేకుండా, 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత సీఎం […]</p>

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రముఖ నటుడు సోసాని కృష్ణమురళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర పాలకులు తెలంగాణను వదిలి వెళ్లాక కొత్త రాష్ట్రంగా తెలంగాణ దగదగలాండింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. నగరంలో ఒక్కరోజు కూడా పవర్ కట్ లేకుండా, 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఎడారిగా మారిన తెలంగాణను నీటితో సస్యశ్యామలం చేసింది కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు ఇండియాలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్‌కే ఓటు వేయాలని ప్రజలను కోరారు.






