అందరి చూపు కరీంనగర్ వైపే.. కౌంటింగ్ కోసం తరలివెళ్తున్న నేతలు

by Sridhar Babu |   (  Updated:2021-11-01 01:50:28  IST  )

<p>దిశ, హుజురాబాద్: అందరి చూపు కరీంనగర్ వైపు మళ్లింది. హుజురాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు కరీంనగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరుగనుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లందరూ మధ్యాహ్నం వరకే కరీంనగర్ చేరుకోవాలని ఆయా పార్టీల అధిష్టానం సూచించింది. లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమాయత్తమయ్యాయి. ఫలితం నువ్వా నేనా అన్నట్లు ఉండనుందని భావిస్తున్న పార్టీల పెద్దలు [&hellip;]</p>

Karimnagar-going1
X

దిశ, హుజురాబాద్: అందరి చూపు కరీంనగర్ వైపు మళ్లింది. హుజురాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు కరీంనగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరుగనుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లందరూ మధ్యాహ్నం వరకే కరీంనగర్ చేరుకోవాలని ఆయా పార్టీల అధిష్టానం సూచించింది. లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమాయత్తమయ్యాయి. ఫలితం నువ్వా నేనా అన్నట్లు ఉండనుందని భావిస్తున్న పార్టీల పెద్దలు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని క్యాడర్ కు ఇప్పటికే సూచనలు చేశారు. మెజారిటీ అటు ఇటుగా మారుతుంటుందని, చివరి రౌండ్ వరకు గెలుపు ఓటములు దోబుచులాడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతుండటం, సర్వేలు వెల్లడించిన అంచనాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు అందజేసిన నివేదికలతో స్వల్ప మెజారిటీతోనే బీజేపీ లేదా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించనున్నట్లు తేలడంతో మరింత ఉత్కంఠకు కారణమవుతోంది. పైకి గెలుపుపై ఎవరి ధీమా వారికున్న ఫలితం ప్రకటించే వరకు టెన్షన్ తప్పట్లేదని ఆయా పార్టీల నాయకులు గుసగుసలాడుతున్నారు.

మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

Next Story