- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు కూలీ సంఘం నేతల నిరసన దీక్ష
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. శనివారం జిల్లా కేంద్రంలోని నీలం రాంచంద్రయ్య భవన్‌లో దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు సందర్భంగా క్వింటాలుకు ఆరు కిలోల పైనే దోచుకుంటున్న రైస్ మిల్లుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోనె సంచుల కొరతను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ దీక్షలో […]</p>

X
దిశ, నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని నిరసిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. శనివారం జిల్లా కేంద్రంలోని నీలం రాంచంద్రయ్య భవన్‌లో దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు సందర్భంగా క్వింటాలుకు ఆరు కిలోల పైనే దోచుకుంటున్న రైస్ మిల్లుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోనె సంచుల కొరతను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ దీక్షలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, సహాయ కార్యదర్శి సాయగౌడ్ పాల్గొన్నారు.
tag: All India Farmer Cooley Society, Leaders, protest, nizamabad, ts news
Next Story






