టీడీపీ కొండపల్లి పర్యటన ఉద్రిక్తం.. పలువురు నేతల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: కొండపల్లి ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ పరిశీలనకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని వేశారు. నిజనిర్ధారణ కమిటీ శనివారం అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించాలని భావించింది. ఈ నేపథ్యంలో పర్యటనకు అనుమతులు లేవంటూ పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు టీడీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు, కొల్లిపర్ర, చేబ్రోలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, [&hellip;]</p>

kondapalli-arrest
X

దిశ, ఏపీ బ్యూరో: కొండపల్లి ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ పరిశీలనకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని వేశారు. నిజనిర్ధారణ కమిటీ శనివారం అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించాలని భావించింది. ఈ నేపథ్యంలో పర్యటనకు అనుమతులు లేవంటూ పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు టీడీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు, కొల్లిపర్ర, చేబ్రోలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల బ్రహ్మంలను నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. అలాగే ఎంఎస్ రాజును చేబ్రోలు పీఎస్‌కు తరలించారు. మరోవైపు మహిళా టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, అన్నాబత్తిన జయలక్ష్మీ, కంభంపాటి శిరీష, మూలుపూరి కళ్యాణి ఇతర మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని కొల్లిపర్ర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్ట్‌లు గృహనిర్బంధాలతో టీడీపీ పోరాటాన్ని అణిచివేయలేరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి హెచ్చరించారు.

Next Story