- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మాపూర్ రైతుల ప్రాబ్లమ్ సాల్వ్.. అండగా నిలిచిన ‘దిశ’
<p>సీఎం దత్తత గ్రామం లక్ష్మాపూర్‌లో రైతుల సమస్యను దిశ కళ్లకుకట్టినట్లుగా చూపింది. 50ఏళ్ల సమస్య పరిష్కారానికి మార్గం సులభం చేసింది. ఆ గ్రామానికి నక్ష లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు సైతం పొందలేకపోయారు. సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ఇచ్చిన హామీ మూడేళ్లయినా పరిష్కారానికి నోచుకోలేదు. విషయం తెలుసుకున్న ‘దిశ’ 2020 జూలై 1వ తేదీన ‘ఆ ఊరుకి శాపం..నక్ష!’ పేరిట కథనం ప్రచురించింది. ఈ కథనం నిద్రమత్తులో ఉన్న అధికారగణాన్ని తట్టిలేపింది. జిల్లా మంత్రి […]</p>

సీఎం దత్తత గ్రామం లక్ష్మాపూర్‌లో రైతుల సమస్యను దిశ కళ్లకుకట్టినట్లుగా చూపింది. 50ఏళ్ల సమస్య పరిష్కారానికి మార్గం సులభం చేసింది. ఆ గ్రామానికి నక్ష లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు సైతం పొందలేకపోయారు. సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ఇచ్చిన హామీ మూడేళ్లయినా పరిష్కారానికి నోచుకోలేదు. విషయం తెలుసుకున్న ‘దిశ’ 2020 జూలై 1వ తేదీన ‘ఆ ఊరుకి శాపం..నక్ష!’ పేరిట కథనం ప్రచురించింది. ఈ కథనం నిద్రమత్తులో ఉన్న అధికారగణాన్ని తట్టిలేపింది. జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద జూలై 3న 250 మంది రైతులకు కొత్త పాస్ బుక్ లు పంపిణీ చేశారు.
దిశ ప్రతినిధి, మేడ్చల్ : సీఎం దత్తత గ్రామం లక్ష్మాపూర్. హైదరాబాద్ నుంచి 40 కిలో మీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లి మండలంలోని ఓ పల్లెటూరు. మూడువేలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో దాదాపు 1200 మంది రైతులు ఉన్నారు. సీఎం రెగ్యులర్ గా ఆ ఊరు మీదుగానే ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ కు రాకపోకలు సాగిస్తుంటారు. ఎర్రవెల్లికి కేవలం 15 కిలో మీటర్ల దూరంలోనే ఉన్న ఊరుపై తనకున్న అభిమానంతో 2017,ఆగస్టు 5న లక్ష్మాపూర్ ను దత్తత తీసుకున్నారు. గ్రామంలో సభ పెట్టి అభివృద్ధి కోసం రూ.15 కోట్లు నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతులంతా ఈ సభలో తమ ఊరుకు నక్షలేదని, దీంతో భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడంలేదని, ఏదైనా అత్యవసరమైతే తమ స్థలాలు క్రయ విక్రయాలు జరుపుకోలేకపోతున్నామని, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నామని సీఎం ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.
దీనికి తోడు రైతు బంధు, రైతుబీమా ప్రభుత్వం నుంచి పొందలేకపోతున్నామన్నారు. స్పందించిన సీఎం కేసీఆర్ తక్షణమే ఊరుకు నక్ష గీసి రైతుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం హామీ ఇచ్చి మూడేళ్లు గడుచినా ఆ ఊరు సమస్య తీరలేదు. రైతుల బాధలు పోలేదు. కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. విషయం తెలుసుకున్న ‘దిశ’ 2020 జూలై 1వ తేదీన ‘ఆ ఊరుకి శాపం..నక్ష!’ పేరిట కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని గ్రామస్తులు అన్ని గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం దిగివచ్చింది. జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద జూలై 3న 250 మంది రైతులకు కొత్త పాస్ బుక్ లు ఇచ్చారు. మిగితా వారికి విడుతల వారీగా పంపిణీ చేస్తున్నారు. అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందుతూ సుధీర్ఘ(50 ఏళ్ల నాటి) సమస్య పరిష్కారానికి మార్గం చూపిన ’దిశ‘ దిన పత్రికకు లక్ష్మాపూర్ గ్రామవాసులు జేజేలు పలికారు.
లక్ష్మాపూర్ సమస్య ఇదీ..
లక్ష్మాపూర్ గ్రామం 50 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లా భువనగిరి తాలూకాలో ఉండేది. అప్పుడు ఆ గ్రామంలో 3,250 ఎకరాల స్థలం ఉంది. 360 మంది రైతులకు పాస్ బుక్ లు ఉన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆ గ్రామాన్ని వీలినం చేసినా ఆ గ్రామానికి కొత్త నక్ష(మ్యాప్) ను రూపొందించలేదు. అయినా భూముల క్రయ విక్రయాలు జరిపారు. దీంతో ఆదనంగా మరో 1000 మందికి పైగా రెవెన్యూ అధికారులు బై నెంబర్లతో కొత్త పాస్ బుక్ లు ఇచ్చారు. దీంతో భూముల హద్దుల విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మూడేళ్ల క్రితం గ్రామస్తులను నేరుగా కలిసిన సీఎంకు తమ ఊరుకు రెవెన్యూ సమస్య ఉందని, గ్రామానికి నక్ష లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు గోడు వెల్లబోసుకున్నారు. దీంతో సీఎం స్పందిస్తూ.. రైతులు ఎవరు దిగులు పడోద్దని, ఊరుకు నక్షను వెంటనే తయారు చేయాలని నాటి కలెక్టర్ ఎంవీ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలు జారీ చేసి సంవత్సరాలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు అధికారులపై తీవ్ర ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. ఎట్టకేలకు గ్రామంలో భూ సర్వే జరిగింది. సర్వేను గూగుల్ మ్యాప్ ద్వారా పూర్తి చేసిన అధికారులు భూ రికార్డులను తప్పుల తడకగా తయారు చేశారు. ఒకరి భూమిని మరొకరి పేరు మీద రికార్డుల్లో ఎక్కించి మరో సమస్యకు తెరలేపారు. గతంలో గ్రామంలో 3,250 ఎకరాల స్థలం ఉండగా, తాజా సర్వే ప్రకారం 3,140 ఎకరాల స్థలమున్నట్లు నక్ష రూపొందించారు. దీంతో భూ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
రైతు బంధు కట్..
గ్రామంలో రెవెన్యూ సమస్యతో రైతులకు కొత్త పాస్ బుక్ ల జారీని నిలిపివేశారు. దీంతో కొత్త పాస్ బుక్ లు లేకపోవడంతో రైతు బంధుతో పాటు రైతు బీమా పథకం కూడా అందని పరిస్థితి నెలకొంది. రైతులు ఎవరైనా ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబానికి బీమా కింద రావాల్సిన రూ.5 లక్షల పరిహారం కూడా ఇవ్వడంలేదు. దీంతో ఆ ఊర్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు ఈ పరిహారానికి నోచుకోవడంలేదు. సర్కారు ప్రకటించని కల్లాల కోసం అప్లికేషన్ చేసుకోవాలన్నా పాస్ బుక్ జిరాక్స్ కాపీ పెట్టాలి. దీంతో రైతులకు కల్లాలు కూడా అందని పరిస్థితి నెలకొంది.






