రాజధానిపై తాడో పేడో తేల్చుకుంటాం : శ్రవణ్‌కుమార్

by  |
రాజధానిపై తాడో పేడో తేల్చుకుంటాం : శ్రవణ్‌కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ఏపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి అమరావతి రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. అవేవి పట్టించుకోకుండా ఏపీ సర్కార్ తన పనిని తాను చేసుకుంటూ పోవడాన్ని న్యాయవాది శ్రవణ్ కుమార్ తప్పుబట్టారు. ఏపీ రాజధానిగా అమరావతి కాకుండా ప్రభుత్వం ఇంకా ఎక్కడైనా పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమరావతి దళిత రైతులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. రాజధాని విషయంపై ప్రభుత్వంతో ఇక తాడో పేడో తేల్చుకుంటాని స్పష్టంచేశారు. అమరావతిని దళితుల శవాలపై నుంచి తరలించాలని చెప్పారు. ప్రాణాలు పోయినా అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదని.. అమరావతి తరలింపును అడ్డుకుని తీరుతామని శ్రవణ్‌ కుమార్ తెలిపారు.

రాజధాని కోసం రైతులు 315 రోజులుగా దీక్షలు చేస్తున్నారని, కనీసం ఎందుకు చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారిని పిలుచి మాట్లాడకుండా, కేసులు పెట్టడం సరికాదన్నారు. మీడియా ముందు దళితులు, వారి అభ్యున్నత గురించి ప్రభుత్వం మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళిత రైతులకు ప్రభుత్వం ఇప్పటికైనా భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వారికి అండగా పాదయాత్ర చేపట్టామని శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed