'లాయర్ సాబ్' కొత్త ముచ్చట్లు

by  |
లాయర్ సాబ్ కొత్త ముచ్చట్లు
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…. ఆయన స్టైల్‌కు తెలుగు ప్రజలు పడిపోయారు. పవనిజం అంటూ ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో తనకు ఇంత గొప్ప ఫేమ్ ఇచ్చిన ప్రజల కోసం పాలిటిక్స్‌లోకి వెళ్లి.. జనసేనానిగా మారాడు పవన్. కానీ అక్కడ మాత్రం పవర్ స్టార్ తన మార్క్ చూపించలేకపోయాడు. పవనిజం అక్కడ పనిచేయకుండా పోయింది. అయితే పరిస్థితులు ఏవైనా పవన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అటు జనసేనానిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఇటు పవర్ స్టార్‌గా జనాన్ని ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు.

తన రీఎంట్రీకి హిందీ సినిమా 'పింక్' రీమేక్‌ను ఎంచుకున్నాడు పవన్. తెలుగులో 'లాయర్ సాబ్‌'గా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. కోర్టు సెట్టింగ్ పూర్తి కాగా… పవన్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. శ్రీ రామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాతలు కాగా… మార్చి ఎండింగ్‌కు షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. మే 15న లాయర్ సాబ్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

Next Story

Most Viewed