- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న సీఐ, లాయర్..
<p>దిశ, ఏపీ బ్యూరో: సాధారణంగా పోలీసులు.. న్యాయవాదులు అంటే ఎంతో గౌరవంగా ఉంటారు. ఇరువురు పలు కేసులకు సంబంధించి వివరాల విషయంలో సహాయసహకారాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఓ చోట న్యాయవాది.. పోలీసులు తన్నుకున్నారు. సాక్షాత్తు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ముష్టియుద్ధానికి దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. డోన్ పీఎస్ వద్ద సీఐ, లాయర్‌లు కొట్టుకోవడం సంచలనంగా మారింది. డోన్ పీఎస్‌లో సీఐ, లాయర్ ఇద్దరూ చితక్కొట్టుకున్నారు. ఓ వివాదానికి సంబంధించి […]</p>

దిశ, ఏపీ బ్యూరో: సాధారణంగా పోలీసులు.. న్యాయవాదులు అంటే ఎంతో గౌరవంగా ఉంటారు. ఇరువురు పలు కేసులకు సంబంధించి వివరాల విషయంలో సహాయసహకారాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఓ చోట న్యాయవాది.. పోలీసులు తన్నుకున్నారు. సాక్షాత్తు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ముష్టియుద్ధానికి దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. డోన్ పీఎస్ వద్ద సీఐ, లాయర్‌లు కొట్టుకోవడం సంచలనంగా మారింది. డోన్ పీఎస్‌లో సీఐ, లాయర్ ఇద్దరూ చితక్కొట్టుకున్నారు. ఓ వివాదానికి సంబంధించి ఇద్దరు లాయర్లు డోన్ పీఎస్‌కు వెళ్లారు.
అయితే ఆ వివాదాన్ని సీఐకి వివరించే క్రమంలో సీఐకి, న్యాయవాదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా గొడవకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడికి దిగారు. ఆ తర్వాత పీఎస్ నుంచి బయటకు వచ్చిన లాయర్‌పై పోలీసులంతా కలిసి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.






