వకీల్ సాబ్‌కు జంటగా అందాల రాక్షసి

by  |
వకీల్ సాబ్‌కు జంటగా అందాల రాక్షసి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి.. తొలి సినిమాతోనే యువతను పడగొట్టేసింది. ‘నాకు పెళ్లి చేసేయండి నాన్నా.. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు’ అనే డైలాగ్‌తో సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న లావణ్య… ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందనే అనుకున్నారు సినీ విశ్లేషకులు. కానీ చిత్రాల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో రేస్‌లో వెనుకపడిపోయింది భామ. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంలో నానితో జతకట్టినా.. తర్వాత సినిమాలు మాత్రం అంతగా కలిసి రాలేదు. రీసెంట్‌గా ‘అర్జున్ సురవరం’తో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్న లావణ్య… గ్లామర్ డోస్‌ పెంచడంతో తమిళ్‌లో ఓ ఛాన్స్ కొట్టేసింది. ‘గద్దల కొండ గణేష్’ ఫేం అథర్వ సరసన నటించే అవకాశం అందిపుచ్చుకుంది. ఈ సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టబోతున్న భామ .. టాలీవుడ్‌లో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా.. కోలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తోంది.

ఇదిలా ఉంటే తమిళ్ ఛాన్స్‌తోనే దశ తిరగబోతోంది అనుకున్న లావణ్యకు.. అదిరిపోయే మరో ఆఫర్ వచ్చేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జోడి కట్టే అవకాశాన్ని చేజిక్కించుకుంది. పవన్ కమింగ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్‌’లో పవన్‌కు జంటగా కనిపించనుంది. ఈ సినిమాలో పవన్‌ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఇద్దరు హీరోయిన్లు కనిపించే అవకాశం ఉందట. వీరిలో ఒకరిగా శృతి హాసన్‌ను ఇప్పటికే సెలెక్ట్ చేయగా.. మరో హీరోయిన్‌గా లావణ్యను ఫైనలైజ్ చేశారట. కాగా ‘పింక్’ రీమేక్‌గా వస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో అంజలి, నివేద థామస్ లైంగిక వేధింపులు ఎదుర్కొనే యువతుల్లా కనిపించబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్ సాబ్‌’కు దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు.

Next Story

Most Viewed