ముద్దు వద్దంటున్న అందాల రాక్షసి

by  |
ముద్దు వద్దంటున్న అందాల రాక్షసి
X

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్పులను తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినీరంగంపైనా ఆ మార్పు స్పష్టంగా కనబడే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్ తర్వాత ఇండస్ట్రీలో మళ్లీ షూటింగ్‌లకు సిద్ధమవుతుండగా.. సినిమాల్లో ఇంతకుముందులా రొమాంటిక్ సన్నివేశాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. లాక్‌డౌన్ తర్వాత ముద్దు సీన్లలో నటించనని స్ట్రెయిట్‌గా చెప్పేస్తోంది ఆ బ్యూటీ. ప్రస్తుతం కరోనా ప్రభావముండటంతో ముద్దు సీన్లలో నటించాల్సి వస్తే నో చెబుతానని అంటోంది. మన ఆరోగ్యంతోపాటు, చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది.

ఒకప్పుడు బికినీకి కూడా సిద్ధమని చెప్పిన ఈ సొట్టబుగ్గల సుందరి.. ఇప్పుడు ముద్దుకు కూడా నో చెబుతుండటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాతో పాటు వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలోనూ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed