ఎక్స్‌క్లూజివ్ : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’

by  |
ఎక్స్‌క్లూజివ్ : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’
X

దిశ, సినిమా : ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫ్రాంచైజ్‌కున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఫస్ట్ సీజన్ సూపర్‌ డూపర్ హిట్ కాగా సెకండ్ సీజన్‌లో సమంత ఎంటర్ కావడంతో మరింత క్రేజ్ పెరిగింది. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్‌గా కనిపించబోతుండగా.. ట్రైలర్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళ టైగర్స్‌ను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, తమిళనాడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్.. నార్త్ నుంచి మాత్రం అప్రిసియేషన్ అందుకుంటోంది.

లేటెస్ట్ ట్రైలర్ సీక్వెల్ మాదిరిగా కాకుండా కొత్త సిరీస్ ట్రైలర్ చూస్తున్నట్లు ఉందని కాంప్లిమెంట్స్ అందుకున్న సీజన్ 2 జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’పై చర్చ జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ సీజన్ 3 కోసం రాజ్ అండ్ డీకేలతో మరోసారి టై అప్ అయినట్లు తెలుస్తోంది. సీజన్ 2 షేపింగ్‌పై ఇంప్రెస్ అయిన టాప్ ఎగ్జిక్యూటివ్స్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫ్రాంచైజ్ ద్వారా మరింత ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని ఆశిస్తున్నారట. ఈ క్రమంలో త్వరలో మూడో సీజన్ గురించి అఫిషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశముందని సమాచారం. ఫ్యామిలీ మ్యాన్‌గా సూపర్ క్రేజ్ సంపాదించిన మనోజ్ బాజ్‌పాయ్ ఈ సిరీస్‌లోనూ కథానాయకుడిగా నటించనున్నారట.



Next Story