- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mango season: మామిడి సీజన్ వచ్చేసింది!
వేసవి కాలం వచ్చేసింది.. మామిడి సీజన్ (Mango season) తెచ్చేసింది.

దిశ, వెబ్ డెస్క్: వేసవి కాలం వచ్చేసింది.. మామిడి సీజన్ (Mango season) తెచ్చేసింది. పండ్లలో రారాజు అయిన మామిడి పండును ఇష్టపడని వారుండరు. మామిడి పండ్లలో గిర్ కేసర్ మామిడి, బంగినపల్లి, నీలం, చందూరా, రసాలు, చక్కెర కట్టి, అల్ఫాన్సో, బెంగుళూరు మామిడి వంటివి ఎన్నో రకాలు ఉంటాయి. ఇందులో ఒక్కొ రకం మామిడి ఒక్కొ రుచిని కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది మామిడి పండ్ల సీజన్ మార్కెట్లలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) అతి పెద్ద టోకు మార్కెట్ రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో (Batasingaram fruit market) మామిడి పండ్ల క్రయ, విక్రయాల సందడి నెలకొంది.
ఇక ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కిలో మామిడి పండ్లు 60 – 70 రూపాయల వరకు పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో కిలో వంద రూపాయల అమ్ముతున్నారు. దిగుబడి తగ్గిన కారణంగా బహిరంగ మార్కెట్‌లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువ గానే ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో పుంజుకోగా ఈ ఏడాది మార్చిలోనే జోరు అందుకుంటుందని అంటున్నారు. మార్కెట్‌కు ప్రతి రోజూ 100 టన్నుల మామిడి దిగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
మామిడి పండ్లు తింటే కలిగే లాభాలివే..
* మామిడి పండులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి.
* మామిడి పండులో ఉండే విటమిన్ A, C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.
* మామిడి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
* ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
* మామిడి పండు ఆరోగ్యానికి చాలా మంచిదైనప్పటికీ, అతిగా తినకూడదు.






