బైక్ పై బహిరంగంగా రొమాన్స్ చేస్తూ ప్రేమికుల రైడ్.. పోలీసులు ఏం చేశారంటే..? (వీడియో)

by Disha Web Desk 1 |
బైక్ పై బహిరంగంగా రొమాన్స్ చేస్తూ ప్రేమికుల రైడ్.. పోలీసులు ఏం చేశారంటే..? (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ-ఎన్.సీ.ఆర్ లో ఈ మధ్య యువ జంటలు వేగంగా బైక్ నడుపుతూ పట్టుబడిన కేసులు విపరీంతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా, ఢిల్లీ వీధులో బైక్ పై ఓ యువ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడిలోవైరల్ అవుతోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ఆ వీడియోలో మంగోల్‌పురి ఔటర్ రింగ్ రోడ్డులోని ఫ్లై ఓవర్‌పై జూలై 16న కారు నడుపుతన్న వ్యక్తి తన ముందు బైక్ పై వెళ్తున్న ప్రేమికుల రొమాన్స్ ను వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీడియోకు 'ఇడియట్స్ ఆఫ్ ఢిల్లీ.. టైబ్ 7:15pm, డే - ఆదివారం 16-జులై ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్, మంగోల్‌పురి దగ్గర' అంటూ క్యాప్షన్ జత చేస్తూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశారు.

Next Story

Most Viewed