- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరీ ఇంత దుర్మార్గమా..? సర్పంచ్ అభ్యర్థి పంటను తగలబెట్టిన దుండగులు!
by Ramesh Naini |
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి ముదురుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి ముదురుతోంది. ఈ నేపథ్యంలో కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో ఘటన కలకలం రేపింది. బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ధరావత్ మహేష్‌కు చెందిన పంటను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. వారం రోజులుగా ప్రచార పనుల్లో ఉన్న మహేష్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో అతనికి చెందిన రెండు ఎకరాల పంటకు దుండగులు నిప్పు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మంటల్లో పంట పూర్తిగా దగ్ధమై భారీ నష్టం జరిగినట్లు సమాచారం. ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటను తగలబెట్టడం ఏమిటి.. మరీ ఇంత దుర్మార్గమా? అని గ్రామస్తులు వాపోయారు. వీడియో ఇదే..
Next Story






