పైసా ఖర్చు లేకుండా.. ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ పొందండిలా!

by Disha Web Desk 1 |
పైసా ఖర్చు లేకుండా.. ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ పొందండిలా!
X

దిశ, వెబ్ డెస్క్: నయా ప్రపంచంలో రకరకాలైన మనుషలు ఉంటారు. అందులో కొందరికి ఖరీదైన దుస్తులు, వాచీలు, వాహనాలు కొనుగోలె చేస్తుంటారు. మరికొందరు తమ హుందాతనాన్ని చాటుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. మరికొందరు తమ ప్రత్యేకత ఉట్టిపడేలా ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల ద్వారా వీఐపీగా గుర్తింపు పొందుతారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసమే వోడాఫోన్ ఐడియా ఒక శుభవార్త చెప్పింది. ఎలాంటి ఖర్చూ లేకుండా ఫ్యాన్సీ ఫోన్ నంబర్లను సులువుగా తమ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా కొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

గతంలో అయితే ఫ్యాన్సీ లేదా వీఐపీ నంబర్ల కోసం వేలం పాటలు జరిగేవి కానీ ఇప్పుడు అలా లేదు. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా తన వినియోగదారుల కోసం వీఐపీ నంబర్లను అన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. అయితే, ఇందుకోసం మీరు కొన్ని ప్రాథమిక ప్రక్రియలను తెలుసుకోవాలి. ఇది తెలిసిన వారికి ఫ్యాన్సీ సిమ్ నంబర్ ఉచితంగా లభిస్తుంది. కోరుకున్న ఫోన్ నంబర్‌ను పొందడానికి వేల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా వోడాఫోన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

కొత్త కనెక్షన్, ఆపై ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ పిన్కోడ్, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఉచిత ప్రీమియం మొబైల్ నంబర్‌ల జాబితా నుంచి ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ తర్వాత మొబైల్‌ నెంబర్‌కి OTP వస్తుంది. అంతే కొత్త కనెక్షన్‌తో వీఐపీ నంబర్‌ వస్తుంది. ప్రస్తుతం వోడాఫోన్-ఐడియా ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ విధంగా వోడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు ఉచితంగా వీఐపీ నంబర్లను అందజేస్తోంది. దీని కోసం మీ నుంచి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు. మీరు ఇలా ఇంటి నుంచే ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌ను కూడా పొందవచ్చు.



Next Story

Most Viewed