- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికటించిన పోలియో చుక్కలు.. పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ మృతి
by GSrikanth |
మొదటి సంతానంగా కొడుకు పుట్టాడన్నా ఆనందం ఆ దంపతులకు రెండు నెలలు కూడా గడవకముందే దూరమయ్యింది.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మొదటి సంతానంగా కొడుకు పుట్టాడన్నా ఆనందం ఆ దంపతులకు రెండు నెలలు కూడా గడవకముందే దూరమయ్యింది. ఆరోగ్యం కోసం వేయించిన పోలియో చుక్కలు వికటించి బిడ్డ ప్రాణాలు పోవటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాదం హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలోని బాలూనాయక్ తాండాకు చెందిన లచ్చిరామ్, మౌనిక భార్యాభర్తలు. ప్రస్తుతం సైదాబాద్ ఖాజాభాగ్ గుడిసెల్లో ఉంటున్నారు. ఏడాది క్రితం పెళ్ళైన వీరికి రెండు నెలల క్రితం మగబిడ్డ పుట్టాడు. కాగా, బుధవారం సాయంత్రం తమ బిడ్డకు సుబ్రహ్మణ్యం నగర్ బస్తీ దవాఖానలో పోలియో చుక్కలు వేయించారు. అవి వికటించి రాత్రి శిశువు చనిపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లచ్చిరామ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






