నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం

by Kema Shiva Kumar |

హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బొగ్గులకుంటలోని ఓ మెకానిక్ షెడ్ లో మంటలు చెలరేగడంతో కారులో నిద్రపోతున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు సెక్యూరిటీ గార్డ్ సంతోష్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాద సమయంలో భారీ పేలుళ్లు, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు ఆర్పేందుకు శ్రమించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో మరణించిన సెక్యూరిటీ గార్డ్ సంతోష్ కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Next Story