- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఎన్నికల్లో సిద్ధిపేట యువతకు అత్యధిక టికెట్లు'
<p>దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ 60వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, ధర్పల్లి చంద్రం పాల్గొని ప్రసంగించారు. రాబోయే కాలంలో సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో యువతకు అత్యధిక కౌన్సిల్ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 60 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం వెన్నెముకగా పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో యువత ముందుండి […]</p>

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ 60వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, ధర్పల్లి చంద్రం పాల్గొని ప్రసంగించారు. రాబోయే కాలంలో సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో యువతకు అత్యధిక కౌన్సిల్ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 60 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం వెన్నెముకగా పనిచేస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో యువత ముందుండి కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయాలను అందరికీ చేరేలా ముందుండి నడిపించాలని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిలకు పెద్దపీట వేసినటువంటి కాంగ్రెస్ ను ఎవరూ మరువద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువత నడుంబిగించి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజ్ వీర్, గ్యాదరి మధు, చిన్న కోడూరు మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, నారాయణ రావు పేట మండల అధ్యక్షుడు బర్మా రామచంద్రం, అర్బన్ మండల అధ్యక్షుడు రాములు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






