భద్రాచలంలో తాజాగా 31 కేసులు

by Sridhar Babu |   (  Updated:2020-08-14 08:01:17  IST  )

<p>దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు కరోనా(corona) విజృంభిస్తోంది. కొత్తగూడెం సింగరేణి, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో వైరస్ ఉద్ధృతంగా ఉంది. శుక్ర‌వారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి (government hospital)లో 68 మందికి కరోనా పరీక్షలు నిర్వహించ‌గా 31 మందికి పాజిటివ్‌(positive)గా నిర్ధార‌ణ అయింది. ఇప్ప‌టికే 100 పైగా కేసులు ఇక్క‌డ న‌మోదైన‌ట్లు స‌మాచారం. తాజాగా శుక్ర‌వారం న‌మోదైన కేసుల‌తో ఈ సంఖ్య 130 కు చేరుకుంది. భద్రాచలంలో ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌ముఖ [&hellip;]</p>

భద్రాచలంలో తాజాగా 31 కేసులు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు కరోనా(corona) విజృంభిస్తోంది. కొత్తగూడెం సింగరేణి, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో వైరస్ ఉద్ధృతంగా ఉంది. శుక్ర‌వారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి (government hospital)లో 68 మందికి కరోనా పరీక్షలు నిర్వహించ‌గా 31 మందికి పాజిటివ్‌(positive)గా నిర్ధార‌ణ అయింది. ఇప్ప‌టికే 100 పైగా కేసులు ఇక్క‌డ న‌మోదైన‌ట్లు స‌మాచారం. తాజాగా శుక్ర‌వారం న‌మోదైన కేసుల‌తో ఈ సంఖ్య 130 కు చేరుకుంది. భద్రాచలంలో ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్( hotel) నిర్వాహకుడు క‌రోనాతో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతిచెందాడు. దీంతో భ‌ద్రాచ‌లంలో మృతుల సంఖ్య ప‌దికి చేరుకుంది.

Next Story