- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలస కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా
<p>దిశ, ఆదిలాబాద్: వలస కూలీలను తీసుకెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో నేషనల్ హైవే 44 పై శనివారం ఉదయం లారీ బోల్తా పడింది. మేడ్చల్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు కూలీలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా […]</p>

X
దిశ, ఆదిలాబాద్: వలస కూలీలను తీసుకెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో నేషనల్ హైవే 44 పై శనివారం ఉదయం లారీ బోల్తా పడింది. మేడ్చల్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు కూలీలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎస్పీ శశిదర్ రాజు పరామర్శించారు. అనంతరం వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story






