- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కబ్జాదారుడెవరు.. కమిషనర్ వాట్సాప్ మెసేజ్ వైరల్
<p>దిశ, ఆందోల్: ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీ కమిషనర్ వాట్సాప్ మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారాన్ని పత్రికలు, టీవీ చానళ్ల ప్రతినిధులు ఉన్న వాట్సాప్ గ్రూపులో శుక్రవారం పోస్ట్ చేశారు. అందులో ‘దౌర్జన్యంగా ఒక పట్టా భూమిని ఆక్రమించి, అనుమతి లేకుండా ఇంటిని నిర్మిస్తూ.. ఏ వ్యవస్థ నన్నేం చేయలేదు’ అని పోస్ట్ చేశారు. అంతేగాకుండా తమ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అందరికీ ఒకేలా న్యాయం ఉంటుందని హెచ్చరిస్తూ […]</p>

దిశ, ఆందోల్: ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీ కమిషనర్ వాట్సాప్ మెసేజ్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారాన్ని పత్రికలు, టీవీ చానళ్ల ప్రతినిధులు ఉన్న వాట్సాప్ గ్రూపులో శుక్రవారం పోస్ట్ చేశారు. అందులో ‘దౌర్జన్యంగా ఒక పట్టా భూమిని ఆక్రమించి, అనుమతి లేకుండా ఇంటిని నిర్మిస్తూ.. ఏ వ్యవస్థ నన్నేం చేయలేదు’ అని పోస్ట్ చేశారు. అంతేగాకుండా తమ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అందరికీ ఒకేలా న్యాయం ఉంటుందని హెచ్చరిస్తూ పోస్ట్ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఎవర్ని ఉద్దేశించి పోస్ట్ చేశారంటూ, ఆ వ్యక్తి ఎవరు అంటూ స్థానికంగా చర్చ జోరుగా జరుగుతోంది. కాగా, అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కమిషనర్ మెసేజ్‌తో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిలో ఆందోళన మొదలైందని చెప్పవచ్చు.






