తాప్సీకి ఫ్యాన్ అయిపోయా : లక్ష్మీ ప్రసన్న

by  |
తాప్సీకి ఫ్యాన్ అయిపోయా : లక్ష్మీ ప్రసన్న
X

బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను.. థప్పడ్ సినిమాకు భారీ ప్రశంసలు అందుకుంది. తన సహజమైన నటనకు విమర్శకులు సైతం శభాష్ అన్నారు. పది మంది ముందు భర్త చెంప దెబ్బ కొడితే భార్య ఎలా రియాక్ట్ అవుతుందన్న సున్నితమైన అంశాన్ని డైరెక్టర్ అనుభవ్ సిన్హా తెరకెక్కించిన విధానం తమని తాము ప్రశ్నించుకునేలా చేసింది.

రీసెంట్‌గా థప్పడ్ సినిమా చూసిన
టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న సైతం తాప్సీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందించింది. ఈ సినిమాలో తాప్సీ నటనకు ఫిదా అయిపోయిన లక్ష్మీ.. తనకు ఫ్యాన్ అయిపోయాయని తెలిపింది. ఇలాంటి బోల్డ్ సినిమాలు ఎంచుకుంటూ మెసేజ్ ఇస్తున్న తాప్సీకి థాంక్స్ చెప్పింది. ‘సినిమా చూస్తున్నంత సేపు తనను తాను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. ఒక కమ్యూనిటీలో పెరుగుతున్న అమ్మాయిలకు ఇబ్బందులు ఎదురైనా సరే ఒక నిర్ణయం తీసుకోలేం’ అని చెప్పింది. తనకు తాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? తన చుట్టూ ఉన్న వారి పరిస్థితి ఏంటీ? అని పదే పదే ప్రశ్నించుకున్నట్లు తెలిపింది.

ఈ సినిమా వెనుక ఎంత కష్టముందో తనకు తెలుసన్న లక్ష్మీ.. స్టోరీ చెప్పడంలో డైరెక్టర్ అనుభవ్ సిన్హా మాస్టర్ అని ప్రశంసించింది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తన జీవితంలో ఒక భాగంగా ఉన్నట్లు అనిపించిందని తెలిపింది. ఇది ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా అని.. మూవీకి పనిచేసిన వారంతా బ్రిలియంట్‌గా వర్క్ చేశారని కంగ్రాట్స్ చెప్పింది లక్ష్మీ.

Next Story

Most Viewed