- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్తీక దీపారాధనలో అపశృతి.. దీపం వెలిగిస్తుండగా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కార్తీక దీపారాధనలో అపశృతి చోటు చేసుకుంది. దేవాలయంలో కార్తీక దీపం వెలిగిస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో చోటు చేసుకుంది. వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చినరావూరులోని శివాలయంలో దీపాలు వెలిగించేందుకు వెళ్లింది. కార్తీక దీపం వెలిగిస్తుండగా.. ప్రమాదవశాత్తూ సుహాసిని చీరకు నిప్పు అంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కార్తీక దీపారాధనలో అపశృతి చోటు చేసుకుంది. దేవాలయంలో కార్తీక దీపం వెలిగిస్తుండగా.. ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని చినరావూరులో చోటు చేసుకుంది. వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చినరావూరులోని శివాలయంలో దీపాలు వెలిగించేందుకు వెళ్లింది.
కార్తీక దీపం వెలిగిస్తుండగా.. ప్రమాదవశాత్తూ సుహాసిని చీరకు నిప్పు అంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే సుహాసిని 50 శాతం కాలిపోయింది. దీంతో స్థానికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో సుహాసిని చికిత్స పొందుతుంది.
Next Story






