ఆ కామెంట్స్‌ బాధాకరం అంటున్న లేడీ కమెడియన్ 

by  |
ఆ కామెంట్స్‌ బాధాకరం అంటున్న లేడీ కమెడియన్ 
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో లేడీ కమెడియన్స్ కొరత చాలానే ఉంది. కొవై సరళ తరువాత అంత కామెడీని పంచె లేడీ నటులు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు ఉన్న లేడీ కమెడియన్స్ లో విద్యుల్లేఖ పేరు చెప్పుకోవచ్చు. ఆమె నటించిన సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ముద్దుగా బొద్దుగా ఉండే విద్యులేఖ ఈ మధ్య చాలా కష్టపడి స్లిమ్ గా మారింది. దీంతో ఆమెకు సంపూర్ణేష్ బాబు “పుడింగి నెంబర్.1” సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది.

దీనిపై సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపై కామెడీ రోల్స్ చెయ్యవా.. హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై స్పందించిన విద్యు, లావు బాగా పెరిగిపోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తుండేవని, అందుకోసం నేను వర్కౌట్లు చేసి సన్నబడితే ఇలా కామెంట్లు చేయడం చాలా బాధాకరమన్నారు. కామెడీతో కూడిన లీడ్ రోల్స్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీ అని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed