అద్దె కూడా కట్టలేని స్థితిలో లేడీ కమెడియన్‌.. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి

by  |
అద్దె కూడా కట్టలేని స్థితిలో లేడీ కమెడియన్‌.. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా రంగం.. ఓ మాయా ప్రపంచం.. ఇక్కడ పైకి మాత్రమే తళుకు బెళుకు సోకులు.. కానీ వారి నిజ జీవితంలోని కష్టాలు మాత్రం ఎవరికి తెలియనివి. పేరు ప్రఖ్యాతలు, ఆస్తులుపాస్తులు అన్ని వారికి ఛాన్సులు ఉన్నంతవరకే.. ఒక్కసారి అవన్నీ పోయాకా వారి జీవితం ఎంతో దయనీయంగా ఉంటుందో చాలామంది జీవితాలు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా టాలీవుడ్ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, లేడీ కమెడీయన్‌ పావలా శ్యామల పరిస్థితి అలాగే ఉంది. దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ఒక పక్క కరోనా వలన ఆగిపోయిన షూటింగ్లు.. మరోపక్క కూతురి ఆరోగ్య సమస్య.. ఇంకోపక్క తినడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఎదుర్కొంటున్నది.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతి నెల వచ్చే రూ.10 వేల పెన్షన్‌ కూడా ఇప్పుడు సరిగా రావడం లేదని, డబ్బు కోసం తనకొచ్చిన అవార్డులను అమ్ముకొని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. గడిచిన మూడు నెలలుగా ఇంటి అద్దెను కట్టలేని దీన స్థితిలో ఉన్న ఆమెను పెద్ద మనసున్న వారు ఆదుకోవాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని పావలా శ్యామల ఎదుర్కోవడం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు సాయం అందించారని ఆమె తెలిపిన విషయం తెల్సిందే. ఇక పేద, వృద్ధ కళాకారులకు అండగా ఉంటామనే ‘మా’ అసోసియేషన్‌ శ్యామల పరిస్థితి తెలుసుకుని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక పావలా శ్యామల ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘బాబాయ్‌ హోటల్‌’, ‘గోలీమార్‌’ వంటి ‘సూపర్‌’, ‘మత్తు వదలరా’ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.



Next Story