- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గందరగోళంగా లాసెట్ కౌన్సెలింగ్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పోటీ పరీక్షల కౌన్సెలింగ్‌లు నిర్వహించేందుకు అధికారులు తడబడుతున్నారు. కనీసం 17 వేల మంది కూడా లేని లాసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఓయూలో ఆపసోపాలు పడుతున్నాయి. కరోనా కాలంలో ఇష్టారాజ్యంగా, గందరగోళంగా నిర్వహిస్తున్న లాసెట్‌తో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. లాసెట్ అధికారులు సైతం వరుసగా పదేపదే తప్పులు చేస్తూ అభ్యర్థుల ఆగ్రహానికి గురిచేస్తున్నారు. ఆరు రోజులుగా లాసెట్ కౌన్సెలింగ్ కోసం విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతుండటంతో వారంతా అధికారులపై […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పోటీ పరీక్షల కౌన్సెలింగ్‌లు నిర్వహించేందుకు అధికారులు తడబడుతున్నారు. కనీసం 17 వేల మంది కూడా లేని లాసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఓయూలో ఆపసోపాలు పడుతున్నాయి. కరోనా కాలంలో ఇష్టారాజ్యంగా, గందరగోళంగా నిర్వహిస్తున్న లాసెట్‌తో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. లాసెట్ అధికారులు సైతం వరుసగా పదేపదే తప్పులు చేస్తూ అభ్యర్థుల ఆగ్రహానికి గురిచేస్తున్నారు. ఆరు రోజులుగా లాసెట్ కౌన్సెలింగ్ కోసం విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతుండటంతో వారంతా అధికారులపై కోపోద్రిక్తులవుతున్నారు.
తెలంగాణ లాసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. మూడేండ్ల లా కోర్సులో 3,900, ఐదేండ్ల కోర్సులో 1,340, పీజీలో 620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఈ ఏడాది లాసెట్ నిర్వహించగా అన్ని కోర్సుల్లో కలిపి 21,559 మంది పరీక్షలకు హాజరు కాగా 16,572 మంది అర్హత సాధించారు. వీరికి ఈనెల 14 నుంచి ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్న అధికారులు రాష్ట్రంలో కేవలం వరంగల్, హైదరాబాద్ సెంటర్లనే ఏర్పాటు చేయడం గమనార్హం. విద్యార్థులు ఏ సమయానికి హాజరు కావాలో ముందుగానే నిర్ణయించిన అధికారులు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 16 వేల మందికి కేవలం రెండు సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
ఓయూ దూరవిద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో రోజంతా ఎదురు చూసినా తమ వంతు రాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు సెంటర్‌లోకి దూసుకెళ్లారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామన్నారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము తిరిగి ఎప్పుడు వెళ్లాలంటూ ప్రశ్నించడంతో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. వందల సంఖ్యలో విద్యార్థులు ప్రాంగణంలో ఉండటంతో ఎవరి నుంచి కరోనా వస్తుందోననే భయాలతో గడపాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాకో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులు కష్టాలు తగ్గించొచ్చని సూచించారు. ఫలితాల ప్రకటనకు ముందే ఓ విద్యార్థి సోషల్ మీడీయాలో తన ర్యాంకును ప్రకటించుకున్నాడు. సోషల్ మీడీయాలో ఆ పోస్టు చక్కర్లు కొట్టడంతో తేరుకున్న అధికారులు మొత్తం ఫలితాలను ప్రకటించారు.
లాసెట్ నిర్వాహణతో పాటు ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా అస్తవ్యస్తంగా నిర్వహించడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంటర్ వెయిటేజీతో ముందుగా రిజల్ట్స్ ప్రకటించారు. అప్పటికే ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోలేదని విద్యార్థుల నుంచి నిరసనలు రావడంతో మళ్లీ ర్యాంకులను సవరించారు. తర్వాత కొవిడ్, ఇతర అనారోగ్యాల కారణాలతో పరీక్ష రాయలేకపోయినవారికి అవకాశం కల్పించారు. వీరికి మరోసారి ర్యాంకులు కేటాయించారు. పాయింట్ మార్కుతో లక్షల మంది విద్యార్థుల జీవితాలు మారిపోయే విషయంలో ఉన్నత విద్యామండలి నిర్వాకం విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తోంది. వ్యయ, ప్రయాసల కోర్చి పరీక్షలకు, కౌన్సెలింగ్‌లకు హాజరవుతుండగా విద్యామండలి, యూనివర్సిటీ అధికారులు తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తుండటంతో నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.






