- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ‘ఉక్కు’ ఉద్యమానికి భారీ మద్దతు
by Shamantha N |
<p>దిశ, ఏపీబ్యూరో : ఢిల్లీలో రెండో రోజు కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదాలతో దేశరాజధాని రెండో రోజూ కూడా దద్దరిల్లుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద సోమవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాధర్నాకు వైసీపీ, టీడీపీ ఎంపీలు మద్దతు పలికారు. సేవ్ […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : ఢిల్లీలో రెండో రోజు కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదాలతో దేశరాజధాని రెండో రోజూ కూడా దద్దరిల్లుతోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద సోమవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహాధర్నాకు వైసీపీ, టీడీపీ ఎంపీలు మద్దతు పలికారు. సేవ్ స్టీల్ ప్లాంట్ల ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. వామపక్ష పార్టీల నేతలు సైతం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇకపోతే రెండో రోజు మంగళవారం ఏపీ భవన్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల నిరసనలకు వైసీపీ, ఆప్, వామపక్షాలు మద్దతు తెలిపాయి.
Next Story






