అమీర్ సినిమా వచ్చే ఏడాదికే!

by  |
అమీర్ సినిమా వచ్చే ఏడాదికే!
X

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’. కరీనా కపూర్ ఖాన్, అమీర్ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా, హాలీవుడ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం విడుదలపై అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.

‘లాక్ సింగ్ చడ్డా’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 25 డిసెంబర్, 2021న సినిమాను థియేటర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకం 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ కామెడీ డ్రామాను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలనుకున్నా.. కరోనా కారణంగా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు వాయిదా పడింది.

‘లాల్ సింగ్ చడ్డా’ న్యూ రిలీజ్ డేట్‌తో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే నటించిన ‘83’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ ఏడాది క్రిస్మస్‌కు ‘83’ కలెక్షన్ల వర్షం కురిపించేందుకు సింగిల్‌గా వచ్చేస్తోంది. కాగా లాల్ సింగ్ చడ్డా సినిమా కోసమే తన సినిమా ‘బచ్చన్ పాండే’ రిలీజ్‌ను జనవరి 2021కు వాయిదా వేసుకున్న అక్షయ్ కుమార్ అదే డేట్ ఫిక్స్ అయ్యాడు. ముందుగా బచ్చన్ పాండేను ఈ ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలనుకున్నా.. అమీర్ రిక్వెస్ట్‌తో వెనక్కి తగ్గాడు అక్షయ్. కానీ ఈ ఏడాది సినిమా రిలీజ్ కాకుండానే ఆపేసింది కరోనా.



Next Story

Most Viewed