- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేగంగా నమోదవుతున్న కేసుల్లో కర్నూలు టాప్
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా నమోదవుతున్న జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో నిలిచింది. రోజువారీ లెక్కన ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ఇటీవల ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా 17 జిల్లాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. 39.9 శాతం నమోదుతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 33.1 శాతంతో ఢిల్లీ రెండో ప్లేస్‌లో ఉంది. ఇక 13.8 శాతం కేసుల నమోదుతో గుంటూరు […]</p>

X
అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా నమోదవుతున్న జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో నిలిచింది. రోజువారీ లెక్కన ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ఇటీవల ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా 17 జిల్లాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. 39.9 శాతం నమోదుతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 33.1 శాతంతో ఢిల్లీ రెండో ప్లేస్‌లో ఉంది. ఇక 13.8 శాతం కేసుల నమోదుతో గుంటూరు 16వ స్థానం దక్కించుకుంది. కాగా, కర్నూలు జిల్లాలో గత కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 26 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 158కి చేరింది.
Tags: carona, kurnool, top place, fastest cases registerd
Next Story






