- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నంద్యాలలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలు జిల్లాలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్ అయింది. దాన్ని పీల్చిన ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి అంబులెన్సులు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలు జిల్లాలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్ అయింది. దాన్ని పీల్చిన ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి అంబులెన్సులు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులంతా భయాందోళనలకు గురవుతున్నారు. గ్యాస్ లీకేజిని అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Next Story






