- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి ఇకలేరు
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి (96) భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడల్లో పయనించిన కుంజా బొజ్జి ఆదర్శ కమ్యూనిస్టుగా ప్రజాభిమానం చూరగొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికైనారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గక, తాను నమ్మిన మార్క్సిస్టుసిద్ధాంతం కోసం ఆయన తన తుదిశ్వాస వరకు పనిచేశారు. సుమారు నెల రోజుల క్రిందట అస్వస్థతకి గురైన ఆయన్ని పార్టీ శ్రేణులు […]</p>

X
దిశ, భద్రాచలం : మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి (96) భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడల్లో పయనించిన కుంజా బొజ్జి ఆదర్శ కమ్యూనిస్టుగా ప్రజాభిమానం చూరగొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికైనారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గక, తాను నమ్మిన మార్క్సిస్టుసిద్ధాంతం కోసం ఆయన తన తుదిశ్వాస వరకు పనిచేశారు. సుమారు నెల రోజుల క్రిందట అస్వస్థతకి గురైన ఆయన్ని పార్టీ శ్రేణులు హైదరాబాద్ తీసుకెళ్ళి చికిత్స చేయించి తీసుకొచ్చారు. మళ్ళీ అనారోగ్యం బారిన పడటంతో భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస వదిలారు. పేదల పెన్నిది, ప్రజానాయకుడైన కుంజా బొజ్జి మరణవార్త తెలియగానే పార్టీ శ్రేణులు, అభిమానులు విషాదంలో మునిగారు.
Next Story






