క్వారంటైన్‌లోకి కుంభమేళ యాత్రికులు

by  |
క్వారంటైన్‌లోకి కుంభమేళ యాత్రికులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కుంభమేళాకు హాజరైన యాత్రికులందరూ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1 నుంచి 17 వరకు కుంభమేళకు వెళ్లిన ప్రతి యాత్రికులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 14 రోజుల పాటు బయటకు రాకుండా కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ప్రత్యేక గదిలో ఉంటూ, తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని సూచించారు.

దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సలహాలు సూచనల కోసం 104 నెంబర్ కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కుంభమేళకు వెళ్లిన యాత్రికుల నుంచి వ్యాధి వ్యాప్తి కాకుండి చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం కుంభమేళ యాత్రికులకు నిబంధనలు విధించింది.


Next Story

Most Viewed