సమంత పిటిషన్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు

by  |

దిశ, సినిమా: నాగ చైతన్యతో విడాకుల కేసులో మూడు యూట్యూబ్ చానెళ్లు తనపై నిరాధారమైన వార్తలు ప్రసారం చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని సినీ నటి సమంత కూకట్‌పల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాస్తవాలతో సంబంధం లేకుండా తన వివాహ జీవితాన్ని బజారున పెట్టారని.. అనవసరపు విశ్లేషణలతో తన పరువు తీశారని పిటిషన్ దాఖలు చేసింది. అసత్యపు ప్రచారం చేసిన రెండు యూట్యూబ్ చానెల్స్, విశ్లేషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని.. తనను అప్రతిష్ట కలిగించినందుకు పరిహారం ఇప్పించాలని కోరింది.

అయితే ఈ కేసుపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు.. పరువు నష్టం దావా వేసే బదులు.. వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని వ్యాఖ్యానించింది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టేది వారే.. పరువుకు నష్టం కలిగింది అనేది వారే కదా అని కోర్టు పేర్కొంది. అయితే విడాకులు తీసుకోకుండానే సమంత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆమె తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేసింది కోర్టు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story

Most Viewed