కేటీఆర్ చేతుల మీదుగా ఎల్. రమణకు టీఆర్ఎస్ సభ్యత్వం..

by  |
TRS-ramana
X

దిశ తెలంగాణ బ్యూరో : టీ-టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌లోకి చేరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. కాసేపట్లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగే పార్టీ చేరికల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు.

కాగా, టీ-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story