రేవంత్ రహస్య భేటీ.. కాంగ్రెస్‌లోకి ఈటల అంటూ KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by  |
రేవంత్ రహస్య భేటీ.. కాంగ్రెస్‌లోకి ఈటల అంటూ KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జంపింగ్ నేతల కారణంగా ఏ పార్టీలో ఏ నేత ఉన్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పార్టీ గుర్తుతో గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లడం ఈ మధ్య రాజకీయ నాయకుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్‌కు హుజురాబాద్‌లో డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. నిజానికి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాదని, కాంగ్రెస్-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే గోల్కొండ రిసార్ట్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రహస్యంగా భేటీ అయ్యారని తెలిపారు. ఏడాదిన్నర తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. చీకటి ఒప్పందంతో ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగానే వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చేందుకు పన్నిన జాతీయ పార్టీల పన్నాగంలో వీరు పావులని అన్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల హుజురాబాద్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.


Next Story