- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నగరంలో ఘనంగా జరిగాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేయడం, మొక్కలు నాటడం, పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ, రక్త దాన శిబిరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నాంపల్లి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ […]</p>

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నగరంలో ఘనంగా జరిగాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేయడం, మొక్కలు నాటడం, పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ, రక్త దాన శిబిరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
నాంపల్లి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తన పనితీరుతో కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మెగా రక్తదాన శిబిరాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్, మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.






