బీజేపీకి 50ప్రశ్నలు సంధించిన కేటీఆర్

by  |
బీజేపీకి 50ప్రశ్నలు సంధించిన కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌లో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. నగర అభివృద్దిపై చర్చకు సిద్ధమని, గుంతలు లేని రోడ్లు చూపిస్తే రూ.లక్ష ఇస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరితే.. హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు ఇవ్వంది మీరనంటే మంత్రి కేటీఆర్.. బీజేపీకి 50ప్రశ్నలు సంధించారు. జాతీయ అంశాలపై 26, రాష్ట్ర విషయాలపై 16, హైదరాబాద్‌పై 8 ప్రశ్నలను లేవనెత్తారు.

గ్రేటర్ హైదరాబాద్‌పై కేటీఆర్ ప్రశ్నలు..

1. ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఒక్కపైసా ఇవ్వంది మీరు కాదా ?
2. యువత ఉపాధి అవకాశాల ఆశల్ని వమ్ముచేస్తూ ఐటీఐఆర్‌ని రద్దు చేసింది ఎవరు ?
3. వరద సాయం కోసం లేఖ రాస్తే అణా పైసా ఇవ్వనిది నిజం కాదా ?
4. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు ఆగమేఘాల మీద వందకోట్లు ఇచ్చింది మీరు కాదా ?
5. హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను తన్నుకుపోయింది ఎవరు ?
6. నమామి గంగేకు వేల కోట్లిచ్చి హైదరాబాద్‌ మూసీకి మొండిచేయి చూపలేదా ?
7. బీహెచ్ఈఎల్, మిధాని రక్షణ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది ఎవరు ?
8. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు స్కైవేలు కడుతామంటే.. కంటోన్మెంట్ రోడ్లను కబ్జా చేసి గుప్పిట్లో పెట్టుకున్నది మీరేనంటూ ఇలా 50 ప్రశ్నలను లేవనెత్తారు.



Next Story

Most Viewed