తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌‌డెస్క్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. భారీ వర్షాలకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సూచించారు. దీంతో ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. కరోనా మహమ్మారి మూలంగా ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అంటువ్యాధుల వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని, దీంతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని [&hellip;]</p>

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌‌డెస్క్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. భారీ వర్షాలకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సూచించారు. దీంతో ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. కరోనా మహమ్మారి మూలంగా ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అంటువ్యాధుల వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని, దీంతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Next Story