కన్నీరు పెట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. ఓదార్చిన కేటీఆర్, హరీష్

by  |

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తన తల్లి ఇటీవల దివంగతురాలు కావడంతో పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను చూడగానే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ తదితరులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మహబూబ్ నగర్ వెళ్లారు.

ముందుగా వారు మంత్రి ఇంటికి చేరుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్, వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంవత్సర కాలంలో వారి కుటుంబాన్ని తమ తల్లిదండ్రులు దూరం చేసి వెళ్లారని విలపించారు. మంత్రి కేటీఆర్.. శ్రీనివాస్ గౌడ్‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం పాలకొండ సమీపంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ సమాధి వద్దకు చేరుకొని అక్కడ నివాళులు అర్పించారు. ఒకేసారి ముగ్గురు మంత్రులు రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story

Most Viewed