- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీడియాపై ప్రభాస్ హీరోయిన్ ఫైర్: సిగ్గుగా ఉంది.. హద్దులో ఉంటే మంచిది అంటూ
<p>దిశ, సినిమా: నటడు సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల సందర్భంగా మీడియా రిపోర్టింగ్ తీరును హీరోయిన్ కృతిసనన్ తప్పుబట్టింది. సిద్ధార్థ్ శుక్లా గురువారం గుండెపోటుతో చనిపోగా శుక్రవారం ఓషివార శ్మశానవాటికలో ఆయన దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా సిద్ధార్థ్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు ఫ్రెండ్స్, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీడియా.. తమ కెమెరాలను సెలబ్రిటీలపై ఫోకస్ చేయడం బాధించిందని కృతిసనన్ వెల్లడించింది. గౌహర్ ఖాన్, కుశాల్ టాండన్, రాహుల్ వైద్య […]</p>

దిశ, సినిమా: నటడు సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల సందర్భంగా మీడియా రిపోర్టింగ్ తీరును హీరోయిన్ కృతిసనన్ తప్పుబట్టింది. సిద్ధార్థ్ శుక్లా గురువారం గుండెపోటుతో చనిపోగా శుక్రవారం ఓషివార శ్మశానవాటికలో ఆయన దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా సిద్ధార్థ్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు ఫ్రెండ్స్, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీడియా.. తమ కెమెరాలను సెలబ్రిటీలపై ఫోకస్ చేయడం బాధించిందని కృతిసనన్ వెల్లడించింది. గౌహర్ ఖాన్, కుశాల్ టాండన్, రాహుల్ వైద్య వంటి చాలామంది ప్రముఖులు మీడియా తీరును విమర్శించగా.. తాజాగా కృతి ఈ విషయంపై స్పందించింది.
“మీడియా, ఫొటోగ్రాఫర్స్, ఆన్‌లైన్ పోర్టల్స్.. ఈ సున్నితమైన అంశం పట్ల వ్యవహరించిన తీరును చూసి నా హృదయం బద్దలైంది. నిజంగా సిగ్గుచేటు.. ఎందుకంటే ఇది వార్తనో, వినోదమో కాదు! మీడియా మనస్సాక్షితో ఆలోచించాలి. రిపోర్టింగ్‌లో కొన్ని బౌండరీస్ ఉండాలి. ఇంతకుముందు చెప్పాను, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నా.. ఇకనైనా అంత్యక్రియలను కవర్ చేయడం ఆపండి! తమ ఆప్తుల్ని కడసారి చూసేందుకు వచ్చిన వారి ముఖాలను మీ కెమెరా ఫ్లాష్‌తో వేటాడటం సమంజసం కాదు” అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసింది.






