- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సీన్ చేసేటప్పుడు భయంతో చేతులు వణికిపోయాయి.. కృతిశెట్టి
<p>దిశ, వెబ్ డెస్క్: మొదటి చిత్రంతోనే కుర్రకారుల మతిపోగొట్టింది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. బేబమ్మ పాత్రలో ఒదిగిపోయిన కృతి.. యువకుల కలల రాకుమారిగా మారింది. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీ అయింది. తాజాగా.. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించింది ఈ కన్నడ భామ. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో నటించాడానికి ఇబ్బంది పడినట్లు బేబమ్మ ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో తన క్యారెక్టర్ […]</p>

దిశ, వెబ్ డెస్క్: మొదటి చిత్రంతోనే కుర్రకారుల మతిపోగొట్టింది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. బేబమ్మ పాత్రలో ఒదిగిపోయిన కృతి.. యువకుల కలల రాకుమారిగా మారింది. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీ అయింది. తాజాగా.. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించింది ఈ కన్నడ భామ. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో నటించాడానికి ఇబ్బంది పడినట్లు బేబమ్మ ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఇంగ్లీష్ మూవీస్ చూసానని తెలిపింది. అంతే కాకుండా మోడ్రన్ అమ్మాయిల స్టైల్ లో నటించాడానికి చాలా కష్టపడ్డానంది ఈ క్యూట్ బ్యూటీ. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో కృతిశెట్టి సిగరెట్ తాగే పాత్రలో కనిపిస్తుంది. అ సీన్ చేసేటప్పడు భయంతో చేతులు వణికిపోయాయని తన అనుభవాన్ని పంచుకుంది బేబమ్మ. సిగరెట్ ఎలా తాగాలో మూడు రోజులు ప్రాక్టీస్ చేశానని తెలిపింది. ఈ సీన్ కోసం ప్రత్యేకంగా నికోటిన్ లేని సిగరెట్లు తెప్పించారని చెప్పింది ఈ అందాల భామ. మొదట ఈ సీన్ వద్దు అన్నానని.. కానీ డైరెక్టర్ ప్రోత్సహించడంతో తప్పలేదని తన అనుభవాలను వెల్లడించింది.






