ఫైనల్ టచ్.. ‘మైరా’గా మారిన కృతి

by  |
ఫైనల్ టచ్.. ‘మైరా’గా మారిన కృతి
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ‘బచ్చన్ పాండే’ చిత్రం ద్వారా ఫస్ట్ టైమ్ కిలాడి అక్షయ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. దాదాపు నెలరోజులుగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో షూటింగ్ జరుగుతుండగా.. ఈ యాక్షన్ – కామెడీ చిత్రం కోసం ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పైగా ఇందులో అక్షయ్‌తో పాటు అర్షద్ వార్శి కూడా జాయిన్ అవుతుండటంతో కామెడీ డోస్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇందులో అక్షయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతుండగా.. కృతి జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ఇందులో తన క్యారెక్టర్ ‘మైరా’గా పరిచయం చేసిన కృతి.. ఇందుకు సంబంధించి చిన్న గ్లింప్స్ ఇచ్చింది. ‘బచ్చన్ పాండే’ బిహైండ్ ది సీన్స్ నుంచి పిక్ షేర్ చేసిన కృతి.. ‘ఫైనల్ టచెస్.. యాక్షన్ చెప్పబోయే కొద్ది సెకన్ల ముందు మైరాగా కొంచెం, కృతి మాదిరిగా మరికొంచెం కలిసి ఉన్న క్షణాలు’ అంటూ పిక్ షేర్ చేసింది. ఈ మధ్యే బచ్చన్ పాండే సెట్స్‌లో బైక్ రైడ్ నేర్చుకున్న కృతి.. ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.


Next Story