కృతి బ్లాక్ అండ్ వైట్ స్టోరీ..

by  |
కృతి బ్లాక్ అండ్ వైట్ స్టోరీ..
X

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. న్యూ హెయిర్ కట్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో అదిరిపోయింది. న్యూ ఫిలాసఫీతో న్యూ పోస్ట్ పెట్టింది. తన గురించి తన ఆలోచనను సరికొత్తగా అభిమానులతో పంచుకుంది. నిజానికి ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు అంటోంది. ఇంతకీ ఏం చెప్తోందంటే…

” నేను పాత ఆత్మ అని అనుకుంటున్నాను .. ఇది నిజమైన ప్రేమ, విధేయతను నమ్ముతుంది.. పాత పాటలను ప్రేమిస్తుంది.. అబద్ధంతో నిండిన ఈ ప్రపంచంలో నిజాన్ని కోరుకుంటుంది.. వినయంగా చేతులు కట్టుకోవడం, నుదిటిపై ముద్దు, లేఖ రూపంలో ఊహించనటువంటి ఒక ప్రత్యేక సందేశాన్ని కోరుకుంటుంది” అంటూ బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేసిన సందర్భంగా బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పరిస్థితుల గురించి చెప్పింది కృతి.

కాగా న్యూ లుక్ లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న కృతి హేర్ కట్ చేసింది మరెవరో కాదు తన సిస్టర్ నూపూర్ సనన్. చాలా ప్రొఫెషనల్ చేసినట్టు ఉందని.. ఈ హేర్ కట్ లో షూట్ చేస్తే బాగుండేది అంటున్నారు కృతి ఫ్రెండ్స్ అండ్ డైరెక్టర్స్. కృతి ఏం చెప్పినా సరే.. తనది మాత్రం ప్యూర్ సోల్ అంటున్నారు ఫ్యాన్స్. కాగా ఈ భామ తెలుగులో మహేష్ బాబుతో నంబర్ వన్ నేనొక్కడినే సినిమాలో నటించింది.

Next Story

Most Viewed