చాలెంజింగ్‌.. కానీ సంతృప్తిగా ఉన్నా : Kriti Sanon

by  |
చాలెంజింగ్‌.. కానీ సంతృప్తిగా ఉన్నా : Kriti Sanon
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తయ్యాయ్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టింది. తన తొలి సినిమా ‘హీరోపంతి’ విడుదలై ఏడేళ్లు కాగా.. అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. తనపై నమ్మకంతో అవకాశమిచ్చిన డైరెక్టర్ సబ్బీర్ అలీ, నిర్మాత సాజిద్‌కు థాంక్స్ చెప్పింది.

సెవెన్ ఇయర్స్ జర్నీలో మెమరబుల్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసిన కృతి.. నటిగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు విభన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆరాటపడుతుంటానని తెలిపింది. డిఫరెంట్ జోనర్స్‌లో ప్రూవ్ చేసే చాన్స్ వచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నానన్న ఆమె.. ఒక పాత్రలో నటించడం చాలెంజింగ్‌గా ఉన్నా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినప్పుడు వచ్చే సంతృప్తి మాటల్లో వివరించలేమని చెప్పింది. కెరియర్‌లో మోస్ట్ ఎగ్జైటింగ్‌ ఫేజ్‌లో ఉన్నానని, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.



Next Story