క్రూరంగా మారిన వరుణ్ ధావన్.. కృతి చెప్తే వింటాడా?

by  |
varun dawan
X

దిశ, సినిమా : వరుణ్ ధావన్, కృతి సనన్ కీ రోల్స్ ప్లే చేస్తున్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘భేడియా’. హారర్ కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ ప్రకటించింది. తమ బౌండరీస్ పుష్ చేస్తూ వరుణ్, కృతి డిఫరెంట్‌గా ట్రై చేస్తున్న ఈ జోనర్‌ను ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం విడుదల గురించి అనౌన్స్ చేసిన కృతి.. ‘దిల్ వాలే’ తర్వాత వరుణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమా అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని తెలిపింది. ‘స్త్రీ మరియు రూహికి భేడియా నమస్కారం’ అని తెలుపుతూ రిలీజ్ డేట్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వరుణ్ తోడేలుగా మారుతున్న విధానం ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. ఇందులో తను స్త్రీలను చెరిచే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇక తనను ప్రతిఘటించే పాత్రలో కృతి నటిస్తుండగా.. టైటిల్ కార్డ్స్‌లోనూ తనపేరే ముందుండటం విశేషం. ఏప్రిల్ 14న థియేటర్స్‌లోకి వచ్చేస్తున్న సినిమాకు అమర్ కౌశిక్ దర్శకులు కాగా, జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.



Next Story

Most Viewed