తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు భారీ షాక్..

by  |
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు భారీ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణా బోర్డు రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించింది. పులిచింతల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు కేఅర్ఎంబీ లేఖ రాసింది. అంతే కాకుండా రాజోలిబండ కుడి కాలువ పనులు ఆపేయాలని, ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో భాగంగానే శ్రీశైలం, ఎడమగట్టు సాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి సాగు, తాగు నీటి అవసరాలు లేని సమయంలో విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయడంలో కృష్ణా బోర్డు అభ్యంతరం తెలిపింది.

దీన్ని వెంటనే నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పవర్ గ్రీడ్ సమస్య ఏర్పడినప్పుడు తప్ప శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయకూడదని సూచించింది. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులను పాటించాలని విజ్ఞప్తి చేసింది. అయితే చిన్న నీటి వనరులకు కేటాయించిన నీటికంటే ఎక్కువ వాటాను వినియోగించుకుంటున్నారు అని ఏపీ లేవనెత్తిన అభ్యంతరంపై వివరణ ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.


Next Story

Most Viewed